నాలుక మడతేసిన ఆజాద్


నాలుక మడతేసిన ఆజాద్
Ghulam Nabi Azad

నాలుక మడతేసిన ఆజాద్

సిమ్లా : తమకు ప్రధాని పదవి ముఖ్యం కాదని, బీజేపీని ఓడించడమే లక్ష్యమని నిన్న వ్యాఖ్యానించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ శుక్రవారం నాలుక మడతేశారు. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు ఇవ్వాలన్నది నేటి వ్యాఖ్య.

దేశంలో సుదీర్ఘ చరిత్ర గల అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ కనుక ఆ పార్టీకి  అవకాశం ఇవ్వాలన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్టీలు  ప్రధాని పదవి కోసం ఘర్షణ పడటం అంత శ్రేయస్కరం కాదని, సంప్రదింపుల ద్వారా ఈ విషయాన్ని  పరిష్కరించుకోవాలని ఆజాద్ అన్నారు.

ఎన్నికల తరవాత కాంగ్రెస్సే అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని, 273 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు కలిసి నిర్ణయిస్తే నేతృత్వం వహించడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.

నాలుక మడతేసిన ఆజాద్ | actioncutok.com

More for you: