క్రికెట్: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్


క్రికెట్: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

క్రికెట్: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్

తొలిసారి ఒక అంతర్జాతీయ ముక్కోణ టోర్నమెంట్ ఫైనల్ గెలిచి చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు. ఐర్లాండ్‌లోని డుబ్లిన్‌లో శుక్రవారం (స్థానికి కాలమానం ప్రకారం) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తనకంటే ఎంతో మెరుగైన వెస్టిండీస్ జట్టుపై బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. వర్ష ప్రభావిత ఈ మ్యాచ్‌ను 24 ఓవర్లకు కుదించారు. ఈ ముక్కోణ టోర్నీలో పాల్గొన్న మూడో జట్టు ఐర్లాండ్.

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 24 ఓవర్లకు 152 పరుగులు చేసింది. వర్షంతో ఆట ఆగేసరికి ఆ జట్టు ఒకే వికెట్ కోల్పోవడంతో డక్‌వర్త్-లూయిస్ విధానం ప్రకారం ఆ జట్టు 209 పరుగులు చేసినట్లు నిర్ణయించారు. ఆ జట్టులో షాయ్ హోప్ 74, ఆంబ్రిస్ 69 పరుగులు చేశారు. 24 ఓవర్లలో 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఇంకా 7 బంతులు మిగిలుండగానే 5 వికెట్లకు 213 పరుగులు చేసి విజయ ఢంకా మోగించింది.

ఆ జట్టులో ఓపెనర్ సౌమ్య సర్కార్ 66 పరుగులు చేయగా, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మొసాద్దెక్ హుస్సేన్ కేవలం 24 బంతుల్లో 52 పరుగులు చేయడం ద్వారా తన జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

క్రికెట్: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్| actioncutok.com

More for you: