Betting on Nara Lokesh


Betting on Nara Lokesh
Nara Lokesh

లోకేష్ ఓట‌మిపై భారీగా బెట్టింగ్‌!

నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన విష‌యం తెలిసిందే. గ‌తంలో కంటే ఈ ద‌ఫా ఓటింగ్ శాతం అత్య‌ధికంగా న‌మోదు కావ‌డంతో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతార‌న్న‌ది ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. పార్టీ నాయ‌కులైతే పెరిగిన ఓటింగ్ శాతం ఎవ‌రి కొంప‌కు ఎస‌రు తెస్తుందా? అని ఆందోళ‌న చెందుతున్నారు.

ఇదిలా వుంటే ఎన్నిక‌ల‌ ఫ‌లితాలు మ‌రో 19 రోజుల్లో వెలువ‌డుతుండ‌టంతో ఏపీలో ర‌స‌వ‌త్త‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫ‌లితాల‌పై కొంత మంది ధీమా వ్య‌క్తం చేస్తూ ప్ర‌మాణ స్వీకారాల‌కి సైతం ముహూర్తాలు చూసుకుంటూ హంగామా చేస్తున్నారు. ఇదిలా వుంటే బెట్టింగ్ రాయుళ్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు.

ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడుతార‌న్న విష‌యంలో స్ప‌ష్ట‌త రాక నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటుంటే బెట్టింగ్ రాయుళ్లు మాత్రం జోరుగా నేత‌ల గెలుపు ఓట‌ముల‌పై పందాలు కాస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేష్ మంగ‌ళ‌గిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆయ‌న గెలుపు ఓట‌ముల‌పై జోరుగా బెట్టింగ్ జ‌ర‌గ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఈ విష‌యం బ‌య‌టికి పొక్క‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు. మంగ‌ళ‌గిరిలో బెట్టింగ్‌కు పాల్ప‌డుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 10 ల‌క్ష‌ల 15 వేలు, కారు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Betting on Nara Lokesh | actioncutok.com

Trending now: