రక్త చరిత్ర: బీజేపీ కార్యకర్త కాల్చివేత


రక్త చరిత్ర: బీజేపీ కార్యకర్త కాల్చివేత

రక్త చరిత్ర: బీజేపీ కార్యకర్త కాల్చివేత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ర్రాష్ట్రం నాడియా జిల్లా చక్దాహలోని తాపాబన్ ప్రాంతానికి చెందిన సంతు ఘోష్‌ అనే 23 ఏళ్ళ బీజేపీ కార్యకర్తను శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో  దుండగులు కాల్చి చంపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఈ దారుణ ఘటన జరగడం గమనించాల్సిన విషయం. ఓ ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్లిన ఆ యువకుడిపై  దుండగులు  అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు.

బుల్లెట్ గాయాలతో పడి ఉన్న అతడిని  ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు  పోలీసులు వెల్లడించారు.  సంతు హత్య విషయం తెలియగానే బీజేపీ నేతలు, కార్యకర్తలు 34వ నెంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. నాడియా  జిల్లాలోని పలు రైల్వే ట్రాక్‌లపై ధర్నా నిర్వహించారు. మరోవైపు ఈ హత్యాకాండపై  విచారణ జరుపుతున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

లోకసభ ఎన్నికలకు ముందు సంతు ఘోష్  టీఎంసీని వీడి బీజేపీలో చేరాడు. ఆయన హత్య వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని నాడియా జిల్లా  బీజేపీ జనరల్ సెక్రటరీ తారక్ సర్కార్ ఆరోపించారు. ఈ ఆరోపణను టీఎంసీ నేతలు ఖండించారు.

రక్త చరిత్ర: బీజేపీ కార్యకర్త కాల్చివేత | actioncutok.com

More for you: