మోదీ, అమిత్‌షా చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోంది


మోదీ, అమిత్‌షా చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోంది
Chandrababu Naidu

మోదీ, అమిత్‌షా చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోంది

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, ఇతర కమిషనర్లతో శుక్రవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన సమావేశంలో  చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశించడంపై అభ్యంతరం తెలిపారు. చంద్రగిరిలో రీపోలింగ్‌ వ్యవహారంపై రాసిన లేఖను ఎన్నికల కమిషన్ కు అందజేశారు.

తొమ్మిది కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ  గతంలో ఇచ్చిన  ఫిర్యాదును ఈసీ పట్టించుకోని వైనాన్ని ప్రశ్నించారు. సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు ఏకపక్షంగా  ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశాలు ఎలా ఇస్తారని  నిలదీసినట్టు బాబు  మీడియాకు వివరించారు. సుమారు నెల రోజులు దాటినా  వైకాపా ఫిర్యాదు మేరకు ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోందని విమర్శించారు.

దాదాపు పాతికేళ్ళు టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న తాను ఇటువంటి ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేదని నిరసన వ్యక్తం చేశారు.  వైకాపా ఫారం-7 పత్రాలను ఇష్టానుసారంగా దాఖలు చేస్తే నిందితుల ఐపీ అడ్రస్‌లు ఇవ్వాలని కోరినా ఇప్పటికీ స్పందించలేదని చంద్ర బాబు మండిపడ్డారు. జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరిచేలా భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్యలు చేస్తే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ధ్వజమెత్తారు.

మోదీ, అమిత్‌షా చెప్పినట్టు ఈసీ నడుచుకుంటోంది | actioncutok.com

More for you: