జగన్ ప్రమాణానికి వెళ్లకూడదని బాబు నిర్ణయం


జగన్ ప్రమాణానికి వెళ్లకూడదని బాబు నిర్ణయం

జగన్ ప్రమాణానికి వెళ్లకూడదని బాబు నిర్ణయం

విజయవాడ: వైసీపీ అధినేత జగన్‌ మోహన్ రెడ్డి  ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన రాదని  టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. బుధవారం టీడీఎల్పీ సమావేశం ముగిసిన తరువాత చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పార్టీ తరపున ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులతో కూడిన బృందాన్ని గురువారం తాడేపల్లిలోని జగన్ నివాసానికి  పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందే జగన్ కు అభినందనలు  తెలిపేందుకు ఆయన నివాసానికి టీడీపీ బృందం వెళ్లనుంది. జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే అంశంపై టీడీఎల్పీలో చర్చ జరిగింది. ప్రమాణ స్వీకారానికి వెళ్లేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

అయితే ఆయన నిర్ణయాన్ని పార్టీ నేతలు అంగీకరించలేదని తెలిసింది. రాజ్‌భవన్ వంటి వేదికల వద్ద ప్రమాణ స్వీకారం చేస్తే వెళ్లొచ్చని, బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున వెళ్లడం సరికాదని నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ తరపున బృందాన్ని పంపాలన్న నేతల సూచనను బాబు అంగీకరించారు.

జగన్ ప్రమాణానికి వెళ్లకూడదని బాబు నిర్ణయం | actioncutok.com

More for you: