Crazy Fan Chasing Heroine


Crazy Fan Chasing Heroine

Bollywood actress Vani Kapoor had files a complaint on a crazy fan who chasing her with a bike

హీరోయిన్‌ని బైక్‌పై వెంబడించిన అభిమాని

‘ఆహా కల్యాణం’లో నాని జోడీగా నటించిన బాలీవుడ్ తార వాణీ కపూర్‌ను ఒక వ్యక్తి బైక్‌పై వెంబడించడం కలవరం సృష్టించింది. వాణితో మాట్లాడాలని భావించిన అతడు కారులో వెళ్తున్న ఆమెను తన బైక్‌పై వెంబడించాడు. ముంబైలోని వెర్సోవా నుంచి బాంద్రా వరకు అతడు తన కారును వెంబడించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది వాణి.

తన డ్రైవర్ కారు వేగాన్ని పెంచినప్పటికీ అతడు వెంబడించడం మానలేదని కూడా ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడ్ని సమీర్ ఖాన్‌గా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకోగా తాను వాణి అభిమానిననీ, ఆమెతో మాట్లాడలనే ఉద్దేశంతోనే వెంటపడ్డానని తెలిపినట్లు సమాచారం.

‘శుద్ధ దేశీ రోమాన్స్’, ‘బేఫికర్’, ‘ఆహా కల్యాణం’ వంటి చిత్రాల్లో నటించిన వాణి ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తొన్న సినిమాలో నటిస్తోంది.

Crazy Fan Chasing Heroine | actioncutok.com

Trending now: