కమల్ సర్కార్: క్షణ క్షణం టెన్షన్!


కమల్ సర్కార్: క్షణ క్షణం టెన్షన్!

కమల్ సర్కార్: క్షణ క్షణం టెన్షన్!

భోపాల్ : మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి మిత్ర పక్షాల స్వల్ప బలంతో కమలనాథ్ ముఖ్యమంత్రిగా ఏర్పడిన ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. అయినా ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా కమల నాథ్ జాగ్రత్తపడుతున్నారు. ఎమ్మెల్యేలెవరూ బీజేపీ ఆశల వాళ్లకు చిక్కకుండా మంత్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి మంత్రి ఐదుగురు ఎమ్మెల్యేల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని కమల నాథ్ సూచించారు.

ఆయా శాసన సభ్యుల నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా సీఎం మంత్రులకు అప్పగించారు. ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలతో కమల నాథ్ విడివిడిగా నిర్వహించిన సమావేశంలో ఉమ్మెల్యేలు మంత్రుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కమల నాథ్ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఎస్పీ, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు.

ఈ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు పూర్తి కాక ముందే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయింది. రాష్ట్రంలోని 29 స్థానాల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. ఈ దశలో కమల్ నాథ్ ప్రభుత్వం సభలో బలం నిరూపించుకోవాలంటూ ప్రతిపక్ష నేత గోపాల్ భార్గవ డిమాండ్ చేస్తూ గవర్నరుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని వార్తలు షికారు చేస్తున్నాయి.

కమల్ సర్కార్: క్షణ క్షణం టెన్షన్! | actioncutok.com

More for you: