వంటింట్లో మొసలి!


వంటింట్లో మొసలి!

వంటింట్లో మొసలి!

గాంధీనగర్ : ప్రచండ భానుని ప్రతాపానికి మనుషులే కాదు జంతువులు చెట్లు చేమలు కూడా అల్లాడి పోతున్నాయి. ఇందుకు ఈ మొసలే సాక్ష్యం. గుజరాత్‌ రాష్ట్రం రావల్ గ్రామ సమీపంలో దాహం వేసిన ఓ మొసలి నీటి కోసం వెతుక్కుంటూ గ్రామం లోకి వచ్చేసింది. రాదాబెన్ అనే ఓ ఇల్లాలు తన కుటుంబ సభ్యులతో ఉంటోంది.

బుధవారం ఉదయం రాధా బెన్ కూతురు నిమీషా మంచి నీరు తాగడానికి వంటింటి  వైపు వెళ్లింది. అప్పటికే ఆ వంటింటిలోని మంచి నీటి కుండలోని నీరు తాగడానికి ప్రయత్నిస్తున్న మొసలిని చూసి పరుగెత్తికెళ్లి తల్లికి చెప్పింది. కూతురి మాటలు  నమ్మని రాధాబెన్ వంటింట్లోకి వెళ్లారు. అక్కడ దాదాపు నాలుగయిదు అడుగుల పొడవున్న మొసలి కుండలో నీరు తాగడానికి ప్రయత్నిస్తున్న వైనాన్ని  చూసి షాక్‌ తిన్నారు.

వెంటనే తేరుకుని ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేసారు. తక్షణం స్పందించిన అధికారులు రెండు గంటలపాటు కష్టపడి దానిని బంధించారు.  చల్ల గాలి కోసం ఇంటి తలుపులు తెరిచి ఉంచడం వల్లే మొసలి ఇంట్లోకి వచ్చిఉండొచ్చని రాధాబెన్ అన్నారు. మొసలి వల్ల  ఎవరికీ ఏ ప్రమాదం జరగక పోవడం కొసమెరుపు.

వంటింట్లో మొసలి! | actioncutok.com