ఒకే నెలలో రానున్న దేవరకొండ బ్రదర్స్

ఒకే నెలలో రానున్న దేవరకొండ బ్రదర్స్
విజయ్ దేవరకొండ.. అనతి కాలంలోనే యూత్ ఐకాన్‌గా ఎదిగిన యువ కథానాయకుడు. ‘పెళ్ళి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో యువతని విశేషంగా ఆకట్టుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. అతి త్వరలో ‘డియర్ కామ్రేడ్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘గీత గోవిందం’ తరువాత కన్నడ బ్యూటీ రష్మికతో కలసి విజయ్ నటించిన ఈ సినిమా.. జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇదే నెల ఆరంభంలో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా తన తొలి చిత్రంతో సందడి చేయబోతున్నాడు. ‘దొరసాని’ పేరుతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. జూలై 5న రిలీజ్‌కి రెడీ అవుతున్నట్లు సమాచారం. కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా రాజశేఖర్ – జీవిత గారాల పట్టి శివాత్మిక కూడా నాయికగా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
మరి.. ఒకే నెలలో మూడు వారాల గ్యాప్‌లో రాబోతున్న దేవరకొండ బ్రదర్స్ ఏ మేరకు మెప్పిస్తారో చూద్దాం.

ఒకే నెలలో రానున్న దేవరకొండ బ్రదర్స్ | actioncutok.com