దేవిశ్రీ పోయి మిక్కీ వచ్చె!

దేవిశ్రీ పోయి మిక్కీ వచ్చె!
ప్రస్తుతం తెలుగునాట నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అగ్ర కథానాయకులందరితోనూ పనిచేయడమే కాదు… విజయాలను కూడా అందుకున్న ఘనత దేవిశ్రీది. అలాంటి దేవిశ్రీ.. గత కొంతకాలంగా నాణ్యత పరంగా మెప్పించలేకపోతున్నాడన్నది విమర్శకుల మాట. ‘రంగస్థలం’ తరువాత ఈ రాక్ స్టార్ అందించిన బాణీలేవీ సంగీత ప్రియుల మెప్పుల పొందలేకపోతున్నాయన్నది నిర్వివాదాంశం.
ఇక తాజా చిత్రం ‘మహర్షి’ సంగతి సరేసరి. ఈ సినిమా విషయంలో.. దేవిశ్రీ పనితీరుపై మహేశ్ ఫ్యాన్స్ నుంచి సగటు ప్రేక్షకుల వరకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్‌తో ఎటాక్ చేశారు.
మరో వైపు.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, యన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి అగ్ర కథానాయకుల తదుపరి చిత్రాలన్నీ వేర్వేరు స్వరకర్తలతో ఉండడం కూడా దేవిశ్రీని కలవరపరిచే అంశమే. సరిగ్గా.. ఇలాంటి సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్‌కి ఓ ఝలక్ తగిలింది.
అదేమిటంటే.. వరుణ్ తేజ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘వాల్మీకి’ నుంచి అతణ్ని తప్పించి మరో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్‌ని ఎంచుకున్నారట. హరీశ్ – దేవిశ్రీ మధ్య చోటుచేసుకున్న క్రియేటివ్ క్లాషెస్ వల్లే.. దేవిశ్రీ స్థానంలోకి మిక్కీ వచ్చి చేరాడని ఫిల్మ్‌నగర్ టాక్.
ఈ వ్యవహారాలు చూస్తుంటే.. దేవిశ్రీకి బ్యాడ్ టైమ్ మొదలైనట్టేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి.. దేవిశ్రీ తన ప్రతిభతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూద్దాం.

దేవిశ్రీ పోయి మిక్కీ వచ్చె! |actioncutok.com
More for you: