డీఎస్పీ టాప్ రికార్డ్


డీఎస్పీ టాప్ రికార్డ్
Devi Sri Prasad

డీఎస్పీ టాప్ రికార్డ్

దేవి శ్రీప్ర‌సాద్‌.. టాలీవుడ్ రాక్ స్టార్‌. రెండు ద‌శాబ్దాలుగా త‌న‌దైన  శైలితో ముందుకు సాగుతున్న ఈ స్వ‌ర‌ చిచ్చ‌ర పిడుగు.. తాజాగా ఓ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. అదేమిటంటే.. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ 10 హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్‌లో 7 సినిమాలు త‌న స్వ‌ర‌క‌ల్ప‌న‌లో రూపొందిన‌వే ఉన్నాయి.

మొద‌టి రెండు స్థానాల్లో ఉన్న ‘బాహుబ‌లి’ సిరీస్ చిత్రాల‌ను.. అలాగే ఏడో స్థానంలో ఉన్న ‘అర‌వింద స‌మేత‌’ని మిన‌హాయిస్తే.. టాలీవుడ్  టాప్ 10 గ్రాస‌ర్స్‌లో ఉన్న మిగిలిన చిత్రాల‌న్నీ దేవి శ్రీప్ర‌సాద్ బాణీల‌తో రూపొందిన సినిమాలే కావ‌డం విశేషం.

‘రంగ‌స్థ‌లం’ (3వ స్థానం), ‘ఖైదీ నంబ‌ర్ 150’ (4వ స్థానం), ‘మ‌హ‌ర్షి’ (5వ స్థానం), ‘భ‌ర‌త్ అనే నేను’ (6వ స్థానం), ‘శ్రీ‌మంతుడు’ (8వ స్థానం), ‘ఎఫ్ 2’ (9వ స్థానం), ‘జ‌న‌తా గ్యారేజ్’ (10వ స్థానం).. ఇలా మొత్తంగా టాప్ 10లోని ఏడు చిత్రాలు డీఎస్పీ సంగీత సార‌ధ్యంలో రూపొందిన‌వే కావ‌డం ప్రశంసనీయం.  మున్ముందు.. ఈ rock star ఖాతాలో ఇంకెన్ని రికార్డులు చేర‌తాయో చూడాలి.

డీఎస్పీ టాప్ రికార్డ్ | actioncutok.com

More for you: