ఓటెయ్యలేకపోయిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు!

ఓటెయ్యలేకపోయిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు!
భోపాల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకుడు, పార్టీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ ఓటేయలేకపోయారు. రాజ్‌గఢ్‌లో ఓటువేయలేకపోయానని, అందుకు
ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని దిగ్విజయ్ ప్రకటించారు.
భోపాల్‌లోని వివిధ పోలింగ్ బూత్‌లలో ఓటింగ్ సరళిని పర్యవేక్షించే పనిలో నిమగ్నమైన దిగ్విజయ్ పోలింగ్ సమయానికి రాజ్‌గఢ్‌కు చేరుకోలేక పోయారు. భోపాల్‌లోని ఓ గుడిలో కనిపించిన దిగ్విజయ్ ను ఓటెయ్యడానికి వెళ్లరా? అని అడిగినపుడు
రాజ్‌ఘడ్‌కు చేరుకోడానికి ప్రయత్నిస్తానని సమాధానమిచ్చారు.
భోపాల్లోఓటింగ్ సరళిని పర్యవేక్షించే పనిలో బిజీగా ఉన్న ఆయన సకాలంలో రాజ్ఘడ్ చేరుకోలేకపోయారు. ఫలితంగా ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు.
ఓటెయ్యలేకపోయిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు! actioncutok.com
Trending now: