దిల్ రాజు.. సిక్స్ ప్యాక్‌!


దిల్ రాజు.. సిక్స్ ప్యాక్‌!
Dil Raju

దిల్ రాజు.. సిక్స్ ప్యాక్‌!

చేతినిండా సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్న స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజుకి.. ‘సిక్స్ ప్యాక్‌’తో ప‌నేంట‌ని అనుకోవ‌ద్దు. ఇక్క‌డ మా ఉద్దేశం.. అది కాదు కూడా. అస‌లు మేట‌ర్‌లోకి వెళితే.. ఈ త‌రం నిర్మాత‌ల్లో అటు క్వాలిటీ ప‌రంగానూ, ఇటు క్వాంటిటీ ప‌రంగానూ దిల్‌ రాజు సంస్థకి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది.

ఇంకా చెప్పాలంటే.. ఒకే ఏడాదిలో అర‌డ‌జ‌ను సినిమాలు నిర్మించి ఈ జ‌న‌రేష‌న్ ప్రొడ్యూస‌ర్స్‌లో కొత్త ట్రెండ్‌కి శ్రీ‌కారం చుట్టాడు రాజు. 2017లో ‘శ‌త‌మానం భ‌వ‌తి’, ‘నేను లోక‌ల్‌’, ‘డీజే’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్‌’, ‘ఎంసీఏ’ చిత్రాల రూపంలో ‘సిక్స్ ప్యాక్‌’ని అందించిన రాజుకి.. వాటిలో ‘డీజే’ని మిన‌హాయిస్తే మిగిలిన అన్ని చిత్రాలూ లాభాల‌నే అందించాయి. 

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఈ ఏడాదిలోనూ రిపీట్ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నాడీ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌. ఇప్ప‌టికే ‘ఎఫ్ 2’, ‘మ‌హ‌ర్షి’ చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన రాజు.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ’96’ రీమేక్ (శ‌ర్వానంద్‌, స‌మంత‌), ‘ఇద్ద‌రి లోకం ఒక‌టే’ (రాజ్ త‌రుణ్‌), ‘వి’ (నాని, సుధీర్ బాబు) చిత్రాల‌ను రిలీజ్ చేయ‌డానికి స్కెచ్ వేస్తున్నాడు.

అంతేకాదు.. ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ ప్ర‌ధాన పాత్ర‌లో ఎన్‌. న‌ర‌సింహారావు డైరెక్ష‌న్‌లో ఓ కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ని ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు రాజు. దీనిని కూడా ఇదే ఏడాదిలో రిలీజ్ చేసే దిశ‌గా ప్రణాళిక‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. 

మొత్త‌మ్మీద‌.. 2017 త‌ర‌హాలో 2019లోనూ ఆరు చిత్రాల‌తో దిల్‌ రాజు బేన‌ర్ మ‌రోసారి వార్త‌ల్లో నిల‌వ‌నుంద‌న్న‌మాట‌. 

దిల్ రాజు.. సిక్స్ ప్యాక్‌! | actioncutok.com

Trending now: