రవితేజ సినిమా ఆగిపోలేదు!


రవితేజ సినిమా ఆగిపోలేదు!

రవితేజ సినిమా ఆగిపోలేదు!

రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విరివిగా ప్రచారంలోకి వచ్చింది. వి.ఐ. ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా స్క్రిప్ట్‌పై రవితేజ అసంతృప్తిగా ఉన్నారనీ, స్క్రిప్టులోని లోపాల్ని సరిచేసుకొమ్మని చెప్పారనీ అందుకే షూటింగ్ నడవడం లేదనీ.. రకరకాలుగా వదంతులు షికార్లు చేస్తూ వస్తున్నాయి.

వాటిని చిత్ర నిర్మాతలు ఖండించారు. సోమవారం విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో ఇప్పటికే ‘డిస్కో రాజా’ ఫస్ట్ షెడ్యూల్ నిర్వహించామనీ, రెండో షెడ్యూల్ మే 27 నుంచి జరుగుతుందనీ తెలిపారు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్‌మెంట్శ్ బేనర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ “ఇటీవ‌లే విడుద‌ల చేసిన‌ డిస్కోరాజా మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఫస్ట్ షెడ్యూల్ తో ఫుల్ హ్యాపీ గా ఉన్నాం. ఔట్ ఫుట్ చాలా చాలా బాగా వచ్చింది. రెండో షెడ్యూల్ కోసం ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇంతలోనే… ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు చూసాం. ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు” అని ఆయన చెప్పారు.

సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా సినిమా రూపొందుతున్న నేప‌థ్యంలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో కూడిన స‌న్నివేశాలు కీల‌కమనీ, దీని కోసం ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్, చిత్ర యూనిట్ ప‌క్కా ప్లానింగ్ తో త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామనీ తెలిపారు.

“అందుకోస‌మే మొద‌టి షెడ్యూల్ పూర్తి కాగానే రెండో షెడ్యూల్ కోసం ఎక్కువ స‌మ‌యం తీసుకోవాల్సి వచ్చింది. రెండో షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్న సందర్భంలోనే సినిమా ఆగిపోయిందని వచ్చిన వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. మే 27 నుంచి జూన్ 21 వ‌ర‌కు హైద‌రాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నాం. ఈ కీలక షెడ్యూల్ లో ర‌వితేజ‌గారితో పాటు చిత్ర యూనిట్ అంతా పాల్గొంటుంది” అని వివరించారు రామ్.

ఈ చిత్రంలో ‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ పాయల్ రాజ్ పుత్, ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నేల టిక్కెట్’ తర్వాత రవితేజతో రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న రెండో చిత్రమిది.

బాబీ సింహా విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సత్య, సునీల్, రాంకీ ఇతర పాత్రధారులు.

అబ్బూరి రవి సంభాషణలు రాస్తుండగా, తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

రవితేజ సినిమా ఆగిపోలేదు! | actioncutok.com

Trending now: