సల్మాన్, దిశ రష్యన్ సర్కస్!


‘భారత్’ సినిమాలో సల్మాన్ ఖాన్‌తో దిశా పటాని చేసిన రష్యన్ సర్కస్ హైలైట్‌గా నిలవనున్నది.

సల్మాన్, దిశ రష్యన్ సర్కస్!

సల్మాన్, దిశ రష్యన్ సర్కస్!

సరికొత్త జంటలతో బాలీవుడ్ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. సల్మాన్ ఖాన్ సినిమా ‘భారత్’ ట్రైలర్ రిలీజవగానే ఒక పాటలో సల్మాన్, దిశా పటాని జోడీ కనిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. వాళ్ల మధ్య కెమిస్ట్రీ గొప్పగా పండినట్లు కనిపించింది. దిశ వేసుకున్నా కాస్ట్యూమ్స్, ఆమె గ్లామర్ సినీ ప్రియుల్ని అలరించాయి.

తాజాగా ఒక సర్కస్ సీన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో దిశ పోస్ట్ చేసిన ఒక స్టిల్ అయితే అదరగొట్టింది. క్షణాల్లో ఆ స్టిల్ వైరల్ అయింది. సల్మాన్ బైక్ నడుపుతుండగా, దాని వెనుక సీటుపై నిల్చొని రెండు చేతులూ చాచి దిశ విన్యాసం చేస్తున్నట్లున్న ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రాం పేజీలో షేర్ చేసింది దిశ.

“విల్‌కం టు ద గ్రేట్ రష్యన్ సర్కస్, రి-లైవ్ సర్కస్ విత్ ‘భారత్’!” అని దానికి క్యాప్షన్ జోడించింది. దాన్ని బట్టి ఆ ఇద్దరూ రష్యన్ సర్కస్ కళాకారులని అర్థమవుతోంది. సినిమాలో అది క్లైమాక్స్ ఘట్టంలో వచ్చే సీన్ అని అంతర్గత వర్గాలు చెబ్తున్నాయి.

‘భారత్’ ఆల్బంలో విడుదలైన తొలిపాట ‘స్లో మోషన్’లో సల్మాన్‌తో కలిసి స్టెప్పులేస్తూ దిశ చేసిన నాట్య విన్యాసాలు ప్రేక్షకుల మతులు పోగొట్టాయి. పాటకు తగ్గట్లే స్లో మోషన్‌తో ఆ పాట ఆకట్టుకుంది.

సల్మాన్, దిశ రష్యన్ సర్కస్! | actioncutok.com

Trending now:

One thought on “సల్మాన్, దిశ రష్యన్ సర్కస్!

Comments are closed.