కడుపులో కత్తులు, స్పూన్లు, స్క్రూడ్రైవర్లు!


కడుపులో కత్తులు, స్పూన్లు, స్క్రూడ్రైవర్లు!

కడుపులో కత్తులు, స్పూన్లు, స్క్రూడ్రైవర్లు!

మండి (హిమాచల్ ప్రదేశ్) : హిమాచల్ ప్రదేశ్ లోని మండి నగరానికి చెందిన కరణ్ సేన్ (35) ఓ మానసిక రోగి. ఓ రోజు భరించలేని కడుపు నొప్పితో విలవిలలాడి పోతున్న అతనిని కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని కడుపులో ఇనుప వస్తువులున్నట్లు అతనిని పరీక్షించిన డాక్టర్లు గుర్తించారు.

మెరుగయిన చికిత్స కోసం మండి సిటీలోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. అక్కడ ఆతనిని పరీక్షించిన డాక్టర్లు కడుపులో ఎనిమిది స్పూన్లు, వంటింటిలో వాడుకునే ఓ కత్తి , రెండు స్క్రూడ్రైవర్లు, రెండు టూత్ బ్రష్ లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతనికి ఆపరేషన్ చేసి వాటిని బయటకు తీశారు.

మామూలు మనుషులెవ్వరూ ఇలాంటి వాటిని మింగలేరని, మానసిక రోగి అవడం వల్ల తానేమి చేస్తున్నాడో తెలియని స్థితిలో అతను వాటిని మింగాడని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే కోలుకుంటాడని అన్నారు.

కడుపులో కత్తులు, స్పూన్లు, స్క్రూడ్రైవర్లు! | actioncutok.com

More for you: