పాలిటిక్స్: వందమంది మోదీలు వచ్చినా మమతను ఏమీ చేయలేరు!
బెంగాల్ టైగర్ లాంటి మమతా బెనర్జీని వందమంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఏమీ చేయలేరని తెలుగు దేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

పాలిటిక్స్: వందమంది మోదీలు వచ్చినా మమతను ఏమీ చేయలేరు!
బెంగాల్ టైగర్ లాంటి మమతా బెనర్జీని వందమంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఏమీ చేయలేరని తెలుగు దేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ లో చంద్రబాబు గురువారం తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగు ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్నఖరగ్ పూర్ లో చంద్రబాబు తెలుగులో ప్రసంగించారు.
ఇక్కడే స్థిరపడి ఈ ప్రాంత అభివృద్ధిలో తెలుగువారు పాలుపంచుకోవడం చూస్తే ఆనందంగా ఉందన్నారు. బెంగాల్ పురోగతిలో తెలుగువాళ్లు కూడా భాగం కావడాన్ని చూసినప్పుడు ఓ తెలుగువాడిగా ఎంతో గర్విస్తున్నానని తెలిపారు.
ఈ సభకు హాజరైన తెలుగు ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు ఉద్వేగంతో ప్రసంగించారు. “అఖండ మెజారిటీతో దీదీజీని గెలిపించాలి. 42కి 42 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే గెలవాలి. ప్రతి ఒక్కరూ టీఎంసీకే ఓటెయ్యాలి” అని బాబు పిలుపునిచ్చారు.
మమతా బెనర్జీ ఏడేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారనీ, ఆమె ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారననీ బాబు తెలిపారు.
పాలిటిక్స్: వందమంది మోదీలు వచ్చినా మమతను ఏమీ చేయలేరు! | actioncutok.com
Trending now: