స్మృతి ఇరానీ మద్దతుదారుడ్ని చంపేశారు!


స్మృతి ఇరానీ మద్దతుదారుడ్ని చంపేశారు!

స్మృతి ఇరానీ మద్దతుదారుడ్ని చంపేశారు!

అమేథీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నాడియా జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్తను శుక్రవారం రాత్రి కొందరు దుండగులు కాల్చి చంపిన దుర్ఘటనను మరవక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోను సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. అమెథీకి సమీపంలో ఉన్న ఓ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

బీజేపీ నాయకురాలు, అమేథి నియోజకవర్గంలో రాహుల్ గాంధీని ఓడించి  ఎంపీగా విజయం సాధించిన  స్మృతి ఇరానీకి ఆయన బలమైన మద్దతుదారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె తరఫున ప్రచారం చేశారు. బీజేపీ కార్యకర్త అయిన సురేంద్ర సింగ్ అనే వ్యక్తి అమేథి నియోజకవర్గంలో ఉన్న ఓ గ్రామానికి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి స్మృతి ఇరానీ తరపున విస్తృతంగా  ప్రచారం చేశారు.

ఆయనను  శనివారం అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. తీవ్రంగా గాయపడిన  ఆయనను  వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేంద్ర సింగ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హత్య విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ అతడి మృతికి తీవ్ర  సంతాపం వ్యక్తం చేశారు. అతడి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అంతటితో ఆగకుండా అతడి పాడెను మోసి మానవత్వాన్ని, కార్యకర్తలపై అభిమానాన్ని  చాటుకున్నారు.

స్మృతి ఇరానీ మద్దతుదారుడ్ని చంపేశారు! | actioncutok.com

More for you: