చిరు టైటిల్స్‌కి ఫుల్ డిమాండ్‌!


చిరు టైటిల్స్‌కి ఫుల్ డిమాండ్‌!
Chiranjeevi

చిరు టైటిల్స్‌కి ఫుల్ డిమాండ్‌!

పాత టైటిల్స్‌తో కొత్త చిత్రాలు రావ‌డం తెలుగునాట అనాదిగా ఉన్న సంప్ర‌దాయ‌మే.  ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న ప‌లు చిత్రాలు కూడా ఇవే బాట‌లో వెళుతున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ ఏడాదిలో పాత టైటిల్స్‌తో రానున్న కొత్త చిత్రాల‌లో చిరంజీవి టైటిల్స్‌తో వ‌స్తున్న సినిమాలే ఎక్కువ‌గా ఉండ‌డం విశేషం.

నాని న‌టిస్తున్న ‘గ్యాంగ్ లీడ‌ర్‌’, విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న మ‌ల్టీలింగ్వ‌ల్ మూవీ ‘హీరో’, బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ న‌టిస్తున్న రీమేక్ ఫిల్మ్ ‘రాక్ష‌సుడు’, శ్రీ‌కాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న ‘కోత‌ల రాయుడు’తో మొద‌లుకుని.. త‌మిళ అనువాద చిత్రాలు ‘ఖైదీ’ (కార్తి క‌థానాయ‌కుడు), ‘జ్వాల‌’ (విజ‌య్ ఆంటోని) వ‌ర‌కు.. చిరు టైటిల్స్‌దే హ‌వా. అంతేకాదు.. ఇప్ప‌టికే ఈ ఏడాది ఆరంభంలో చిరు తొలి చిత్రం ‘ప్రాణం ఖ‌రీదు’ పేరుతో ఓ సినిమా రిలీజైంది కూడా.

గ‌తంలోనూ.. చిరు టైటిల్స్‌తో ‘స్టేట్ రౌడీ’, ‘య‌ముడికి మొగుడు’, ‘శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు’, ‘యుద్ధ భూమి’, ‘రోష‌గాడు’, ‘రాక్ష‌సుడు’ (సూర్య‌), ‘విజేత‌’, ‘హీరో’ (నితిన్‌), ‘సంఘ‌ర్ష‌ణ‌’.. ఇలా ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. అయితే.. వాటిలో ‘శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు’ మాత్ర‌మే విజ‌యం సాధించింది. ఈ  నేప‌థ్యంలో.. కొత్త చిత్రాల‌లో ఏవి విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తాయో చూడాలి.

చిరు టైటిల్స్‌కి ఫుల్ డిమాండ్‌! | actioncutok.com

Trending now: