త‌మ‌న్నాకి అతడే హీరో.. అతడే విల‌న్‌!


తమన్నా నాయికగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోగా, ఇంకో సినిమాలో విలన్‌గా ప్రభుదేవా నటిస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

త‌మ‌న్నాకి అతడే హీరో.. అతడే విల‌న్‌!
Tamannaah Bhatia

త‌మ‌న్నాకి అతడే హీరో.. అతడే విల‌న్‌!

ఒక క‌థానాయిక న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుద‌ల కావ‌డం… అప్పుడ‌ప్పుడు చోటుచేసుకునే వ్య‌వ‌హార‌మే. అయితే… అవి రెండూ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కావ‌డంతో పాటు ఒకే జాన‌ర్‌కి చెందిన సినిమాలైతే… అది క‌చ్చితంగా వార్త‌ల్లో నిలిచే అంశ‌మే. అలా… మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా త‌న కొత్త చిత్రాల‌తో వార్త‌ల్లో నిలుస్తోంది.

ఆ వివ‌రాల్లోకి వెళితే…మూడేళ్ళ క్రితం త‌మ‌న్నా న‌టించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘అభినేత్రి’. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందిన ఈ హార‌ర్ కామెడీ ఫిల్మ్‌ ఫ‌లితం ఏమైనా న‌టిగా మాత్రం త‌మ‌న్నాకి మంచి మార్కులే పడ్డాయి. క‌ట్ చేస్తే… ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘అభినేత్రి 2’ తెర‌కెక్కింది. మే 31న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్‌కి రెడీ అవుతోంది.

స‌రిగ్గా అదే రోజున‌… త‌మ‌న్నా న‌టించిన మ‌రో హార‌ర్ మూవీ రాబోతోంది. అదే.. ‘ఖామోషి’. ప్ర‌ధానంగా హిందీ భాష‌లో రూపొందిన ఈ సినిమా… ద‌క్షిణాది భాష‌ల్లోనూ అనువాదం కానుంది. విశేష‌మేమిటంటే… ఈ రెండు చిత్రాల్లోనూ మ‌ల్టీటాలెంటెడ్ ప్ర‌భుదేవా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించాడు.

‘అభినేత్రి 2’లో త‌మ‌న్నాకి భ‌ర్త‌గా న‌టించిన ప్ర‌భుదేవా.. ‘ఖామోషి’లో విల‌న్‌గా యాక్ట్ చేశాడు. మొత్తానికి.. త‌మ‌న్నాకి ప్ర‌భుదేవానే హీరో, విల‌న్ అన్న‌మాట‌. మ‌రి.. ఈ రెండు చిత్రాల్లో త‌మ్మూకి ఏ సినిమా వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

త‌మ‌న్నాకి అతడే హీరో.. అతడే విల‌న్‌! | actioncutok.com

Trending now: