Here Is The Most Memorable Thing In Mahesh’s Life

After watching the morning show of ‘Murari’ in Sudarshan 35MM, My father (Krishna) turned over my shoulder, says Mahesh.
‘మురారి’ షో అయిపోయాక నాన్న నా భుజం మీద చెయ్యిపెట్టారు
హీరోగా మహేశ్ కెరీర్ ‘రాజకుమారుడు’తో మొదలైంది. అయితే మహేశ్ మంచి నటుడు అనే పేరు తెచ్చిన సినిమా మాత్రం ఆయన నాలుగో సినిమా ‘మురారి’. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఆ సినిమా నటుడిగా మహేశ్ కెరీర్‌కి ఊపిరినిచ్చింది. ఆ విషయం మహేశ్ స్వయంగా చెప్పిన మాట. తనను ‘మురారి’తో నటుడిగా ప్రేక్షకులు గుర్తించారని ఆయన చెప్పాడు. అంతేకాదు. తన జీవితంలో మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ కూడా ఆ సినిమాతోనే ముడిపడి ఉందని మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
“నేను నాన్నగారితో మార్నింగ్ షోస్ చూసేవాడ్ని, ఎక్కువగా సుదర్శన్ 35 ఎంఎంలో చూసేవాడ్ని. ‘మురారి’ని నాన్నగారితో మార్నింగ్ షో చూశా. షో అయిపోయాక ఆయన నా భుజం మీద చెయ్యిపెట్టారు. నోటితో బాగుందా, బాగాలేదా.. అనే విషయం ఏమీ చెప్పలేదు. భుజం మీద అలా చెయ్యిపెట్టారంతే. ఆ చర్యే చాలా చెప్పింది. నా మనసులో అది అలాగే ముద్రించుకుపోయింది” అని చెప్పాడు మహేశ్.
పైకి చాలా చిన్న విషయంగా కనిపించే ఆ సంఘటన జరిగి 18 సంవత్సరాలు గడిచినా, మహేశ్‌కు ఇప్పటికీ అదింకా మనసులోనే ఉన్నదంటే అది కలిగించిన ప్రభావం ఎంతటిదో ఊహించుకోవాల్సిందే.
Here Is The Most Memorable Thing In Mahesh’s Life | actioncutok.com
Trending now: