కాంగ్రెస్ ఓడితే రాజీనామా!


కాంగ్రెస్ ఓడితే రాజీనామా!
Amarinder Singh

కాంగ్రెస్ ఓడితే రాజీనామా!

చండీగఢ్‌: పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆశించినన్ని స్థానాల్లో గెలవకపోతే అందుకు తానే బాధ్యత వహించి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. గెలుపోటములకు మంత్రులు, ఎమ్మెల్యేలే బాధ్యత వహించాలన్న పార్టీ  అధిష్ఠానం  ఆదేశం  మేరకు  ఆశించినన్ని స్థానాల్లో విజయం సాధించకపోతే అందుకు తానే  బాధ్యత వహించి  రాజీనామా చేస్తానని  అమరీందర్ ప్రకటించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ గెలుపు, ఓటములకు బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ విజయఢంకా మోగిస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్థానాల్లో  కాంగ్రెస్‌ 3 స్థానాల్లోనే గెలిచింది. ఆరింటిలో బీజేపీ, మిగతా  నాలుగు స్థానాలను ఆప్‌ సొంతం చేసుకుంది.

పదేళ్ల పాటు శిరోమణి అకాళీదళ్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కాంగ్రెస్‌ 2017లో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో  77 స్థానాలను దక్కించుకుని కాంగ్రెస్‌  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అమరీందర్‌ రెండోసారిముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు ఆయన మొదటిసారిగా 2002 లో ముఖ్యమంత్రి పీఠమెక్కారు.

కాంగ్రెస్ ఓడితే రాజీనామా! | actioncutok.com

More for you: