తగ్గిన దేవిశ్రీ‌, త‌మ‌న్ హవా!


కొంత కాలంగా తెలుగు సినిమాల్లో దేవి శ్రీ ప్రసాద్, తమన్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ల హవా తగ్గు ముఖం పడుతుండగా, ఇతర భాషలకు చెందిన సంగీత దర్శకులు విరివిగా అవకాశాలు పొందుతున్నారు.

తగ్గిన దేవిశ్రీ‌, త‌మ‌న్ హవా!
Devi Sri Prasad and Thaman

తగ్గిన దేవిశ్రీ‌, త‌మ‌న్ హవా!

సంగీతానికి ఎల్ల‌లు లేవు. అందుకే… ప్ర‌తిభ ఉంటే చాలు ఏ భాష‌కు చెందిన స్వ‌ర‌క‌ర్త అయినా మ‌రో భాష‌లో త‌న స‌రిగ‌మ‌ల విన్యాసాల‌తో రాణించ‌గ‌ల‌డు. ప్ర‌స్తుతం తెలుగునాట రూపొందుతున్న సినిమాల‌ను గ‌మ‌నిస్తే… ఇది మ‌రోసారి స్ప‌ష్ట‌మ‌వుతోంది. చిన్న‌, పెద్ద తేడా లేకుండా ప‌లు తెలుగు చిత్రాల‌కు ప‌ర‌భాష స్వ‌ర‌క‌ర్త‌లు బాణీలు అందిస్తున్నారు.

ముఖ్యంగా… నిన్న‌మొన్న‌టివ‌ర‌కు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు మ్యూజిక్ స్కోర్ చేయాలంటే… అయితే దేవిశ్రీ ప్ర‌సాద్ లేదంటే త‌మ‌న్ మాత్ర‌మే ఆప్ష‌న్స్‌గా క‌నిపించేవారు. అయితే… ఇప్పుడు సీన్ మారింది.  మ‌న క‌థానాయ‌కులు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ‘కొత్త‌ద‌నం’ కోసం ‘నాన్‌-తెలుగు’ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ప్ర‌స్తుతం నిర్మాణంలో భారీ బ‌డ్జెట్ చిత్రాలు ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ (చిరంజీవి), ‘సాహో’ (ప్ర‌భాస్‌), ‘ప్ర‌భాస్ 20’, బాల‌కృష్ణ – కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్ మూవీతో పాటు… ‘గ్యాంగ్ లీడ‌ర్’, ‘వి'(నాని), ‘డియ‌ర్ కామ్రేడ్‌'(విజ‌య్ దేవ‌ర‌కొండ‌), ‘అర్జున్ సుర‌వ‌రం’ (నిఖిల్‌) వంటి మీడియం బ‌డ్జెట్ సినిమాలు కూడా ప‌ర‌భాష స్వ‌ర‌క‌ర్త‌ల బాణీల‌తోనే రూపొందుతున్నాయి.

వీటిలో ‘సైరా న‌ర‌సింహారెడ్డి’, ‘ప్ర‌భాస్ 20’, ‘వి’ చిత్రాల‌కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేది సంగీత‌మందిస్తుంటే… ‘సాహో’కి కూడా బాలీవుడ్ స్వ‌ర‌త్ర‌యం శంక‌ర్‌-ఎహ‌సాన్‌-లాయ్ బాణీలు స‌మ‌కూర్చుతున్నారు. ఇక బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్ సినిమాకి మ‌రో బాలీవుడ్ స్వ‌ర‌క‌ర్త చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ స్కోర్ చేస్తున్నాడు.

‘గ్యాంగ్ లీడ‌ర్‌’కి త‌మిళ స్వ‌ర‌క‌ర్త అనిరుధ్ మ్యూజిక్ కంపోజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటే… ‘డియ‌ర్ కామ్రేడ్‌’కి కూడా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ బాణీలు అందిస్తున్నాడు. అలాగే విడుద‌ల‌కు సిద్ధ‌మైన ‘అర్జున్ సుర‌వ‌రం’కి కేర‌ళకు చెందిన‌ కంపోజ‌ర్ సామ్ సి.ఎస్ ప‌నిచేస్తే. … అల్లు శిరీష్ ‘ఏబీసీడీ’కి క‌న్న‌డ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జుదా శాండీ స్వ‌రాలు అందించాడు.

ఇక మ‌ల‌యాళ స్వ‌ర‌క‌ర్త గోపీసుంద‌ర్  కొన‌సాగిస్తున్న హ‌వా సంగ‌తి స‌రేస‌రి.  మొత్త‌మ్మీద‌… ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధ‌మైన, సెట్స్ పైన ఉన్న భారీ బ‌డ్జెట్ చిత్రాలు, మీడియం బ‌డ్జెట్ సినిమాల‌కు… హిందీ, త‌మిళ్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌… ఇలా ప‌లు భాష‌ల‌కు చెందిన స్వ‌ర‌క‌ర్త‌లు బాణీలు అందిస్తుండ‌డం విశేషం.

మ‌రి… వీరి హ‌వా చూశాకైనా డీఎస్పీ, త‌మ‌న్ లాంటి వాళ్ళు శైలిని మార్చుకుని మ‌రింత క్వాలిటీ వ‌ర్క్‌ని ఇచ్చి ముందుకు సాగుతారో లేదంటే ఇచ్చిన బాణీల‌తోనే స‌రిపెట్టుకోండంటూ త‌మ ఉనికిని తామే కోల్పోతారో చూడాలి.

తగ్గిన దేవిశ్రీ‌, త‌మ‌న్ హవా! | actioncutok.com

Trending now: