ఐపీఎల్ 2019: వెటరన్ స్పిన్నర్ రికార్డ్ సృష్టించాడు!


ఐపీఎల్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డుల్లోకి ఎక్కాడు.

ఐపీఎల్ 2019: వెటరన్ స్పిన్నర్ రికార్డ్ సృష్టించాడు!

ఐపీఎల్ 2019: వెటరన్ స్పిన్నర్ రికార్డ్ సృష్టించాడు!

భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనలో ఇంకా చేవ తగ్గలేదని నిరూపించాడు. ఐపీఎల్ హిస్టరీలో 150 వికెట్లు పడగొట్టిన మూడో ఇండీయన్ బౌలర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ఢిల్లీ కేపిటల్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు.

ఓవరాల్‌గా చూసినా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు హర్భజన్. హర్భజన్ కంటే ముందు ఢిల్లీ కేపిటల్స్ బౌలర్ అమిత్ మిశ్రా (147 మ్యాచ్‌లలో 157 వికెట్లు), కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ పీయుష్ చావ్లా (157 మ్యాచ్‌లలో 150 వికెట్లు) 150 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్లు. ఈ ముగ్గురూ స్పిన్నర్లు కావడం గమనార్హం.

ఇక టోర్నమెంట్ మొత్తమ్మీద అత్యధిక వికెట్ల రికార్డ్ శ్రీలంక పేసర్ లసిత్ మలింగ పేరిట ఉంది. ఈ ముంబై ఇండియన్స్ బౌలర్ 121 మ్యాచ్‌లలోనే 169 వికెట్లు పడగొట్టడం విశేషం.

ఐపీఎల్ 2019: వెటరన్ స్పిన్నర్ రికార్డ్ సృష్టించాడు! | actioncutok.com

Trending now:

One thought on “ఐపీఎల్ 2019: వెటరన్ స్పిన్నర్ రికార్డ్ సృష్టించాడు!

Comments are closed.