‘అవెంజర్స్: ఎండ్‌గేం’కు చెక్ పెట్టేశాడు!


'అవెంజర్స్: ఎండ్‌గేం'కు చెక్ పెట్టేశాడు!

‘అవెంజర్స్: ఎండ్‌గేం’కు చెక్ పెట్టేశాడు!

భూలోక మహావీరులంతా కలిసి థానోస్‌పై గెలుపు సాధించిన ‘అవెంజర్స్: ఎండ్‌గేం’ బాక్సాఫీస్ వద్ద మూడు వారాలుగా అప్రతిహతంగా చేసిన వీరవిహారానికి నాలుగో వారంలో ‘జాన్ విక్ 3’ చెక్ పెట్టాడు. యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద నాలుగో వారాంతంలో ‘ఎండ్‌గేం’ 29.4 మిలియన్ డాలర్లను వసూలు చేయగా, ఈ వారమే విడుదలైన ‘జాన్ విక్: చాప్టర్ 3’ అనూహ్యంగా 57 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఘన విజయం సాధించింది.

కియాను రీవ్స్ హీరోగా నటించిన యాక్షన్ ఫ్రాంచైజీ ‘జాన్ విక్’లో మూడో భాగంగా వచ్చిన సినిమా మునుపటి సినిమాలు 2014లో వచ్చిన ‘జాన్ విక్’ (14.4 మిలియన్ డాలర్లు), 2017లో వచ్చిన ‘జాన్ విక్: చాప్టర్ 2’ (30.4 మిలియన్ డాలర్లు)లను భారీ తేడాతో అధిగమించింది. ఓవర్సీస్‌లోనూ 35 మిలియన్ డాలర్లను వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్త తొలి వారాంతం వసూళ్లు 92 మిలియన్ డాలర్లకు చేరాయి.

‘అవెంజర్స్: ఎండ్‌గేం’కు చెక్ పెట్టేశాడు! | actioncutok.com