మాట‌ల మాంత్రికుడితో మ‌రోసారి..


మాట‌ల మాంత్రికుడితో మ‌రోసారి..

మాట‌ల మాంత్రికుడితో మ‌రోసారి..

‘అర‌వింద స‌మేత‌’.. య‌న్టీఆర్‌లోని న‌టుడ్ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన సినిమా. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌.. తారక్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చింది. అలా.. త‌న‌కో మెమ‌ర‌బుల్ ఫిల్మ్ ఇచ్చిన త్రివిక్ర‌మ్‌తో మ‌రో సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ట య‌న్టీఆర్‌.

ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉన్న రాజ‌మౌళి మాసివ్ మ‌ల్టిస్టార‌ర్ ‘ఆర్ ఆర్ ఆర్‌’ పూర్త‌య్యాకే అంటే ఈ సంవ‌త్స‌రాంతంలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే తార‌క్‌, త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని.. ప్ర‌స్తుతం త‌మ‌కున్న క‌మిట్‌మెంట్స్ పూర్తయ్యాక కొత్త చిత్రంపై దృష్టి సారించేందుకు ఈ ద్వ‌యం ప్లాన్ చేస్తోంద‌ని టాలీవుడ్ టాక్‌. 

వాస్త‌వానికి.. ‘ఆర్ ఆర్ ఆర్‌’ త‌రువాత కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో య‌న్టీఆర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. ఇప్పుడు అది త్రివిక్ర‌మ్ ఖాతాలో చేరిందన్న‌మాట‌. ఏదేమైనా.. ఈ కాంబినేష‌న్ మూవీపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది.

కాగా.. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ‘జులాయి’, ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ త‌రువాత ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో.. ఈ థ‌ర్డ్ వెంచ‌ర్‌పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

మాట‌ల మాంత్రికుడితో మ‌రోసారి.. | actioncutok.com