నాకు జయదేవ్ లేని లోటు తీరనిది: జూనియర్ ఎన్టీఆర్


నాకు జయదేవ్ లేని లోటు తీరనిది: జూనియర్ ఎన్టీఆర్

నాకు జయదేవ్ లేని లోటు తీరనిది: జూనియర్ ఎన్టీఆర్

అత్యంత ఆప్తుడైన అభిమాని మరణానికి జూనియర్ ఎన్టీఆర్ కదిలిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆ అభిమానికి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యుడు జయదేవ్ సోమవారం (మే 6) మృతి చెందారు. ఈ విషయం తెలియగానే జూనియర్ ఎన్టీఆర్ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా జయదేవ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు

“నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. “నిన్ను చూడాలని” చిత్రంతో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడిగా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడుగా ఉన్న వారిలో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రఘాఢమైన సానుభూతిని తెలుపుతున్నాను” అని పోస్ట్ చేశారు.

దానితో పాటు తనతో జయదేవ్ తీయించుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు.

నాకు జయదేవ్ లేని లోటు తీరనిది: జూనియర్ ఎన్టీఆర్ | actioncutok.com

Trending now: