షాకింగ్: వెనుకంజలో కేసీఆర్ కుమార్తె కవిత!


షాకింగ్: వెనుకంజలో కేసీఆర్ కుమార్తె కవిత!

షాకింగ్: వెనుకంజలో కేసీఆర్ కుమార్తె కవిత!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఫలితం ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓటమి దిశగా పయనిస్తున్నారు. నిజామాబాద్ సిటింగ్ ఎంపీ అయిన ఆమెకు ఈసారి ఎన్నికల్లో బీజేపీ నుంచి అనూహ్యమైన పోటీ ఎదురైనట్లు ఓటింగ్ సరళి తెలియజేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 25 వేల ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో కవిత కాంగ్రెస్ అభ్యర్థి 1 లక్షా 67 వేల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందిన విషయం ఇక్కడ గమనార్హం. కానీ ఈసారి ఎన్నికల్లో సాధారణ రైతులు తమకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వందలమంది నిజామాబాద్ ఎన్నికల్లో నామినేషన్లు వేసి అభ్యర్థులుగా నిలవడం సంచలనం సృష్టించింది. తెలంగాణలో రైతులు ఎంతగా కష్టాలు పడుతున్నారోననే విషయాన్ని ఈ చర్య ప్రతిఫలించినట్లయింది.

ఇది కవితకు ప్రతికూలంగా పరిణమించినట్లు తాజా ఎన్నికల్లో ఓట్ల సరళని బట్టి అర్థమవుతోంది. ఆమెపై బీజేపీ అభ్యర్థి అరవింద్ గెలుపు దిశగా కొనసాగుతున్నారు. ఆయన మాజీ పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యునిగా ఉన్న డి. శ్రీనివాస్ కుమారుడు కావడం గమనార్హం.

షాకింగ్: వెనుకంజలో కేసీఆర్ కుమార్తె కవిత! | actioncutok.com