షాకింగ్: అవసరమైతే బీజేపీతో ముస్లింలు చేతులు కలపాలన్న కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు!


షాకింగ్: అవసరమైతే బీజేపీతో ముస్లింలు చేతులు కలపాలన్న కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు!

షాకింగ్: అవసరమైతే బీజేపీతో ముస్లింలు చేతులు కలపాలన్న కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు!

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత రోషన్ బేగ్ పార్టీ వీడనున్నట్లు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆశించినన్ని  సీట్లు రావంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడిన నేపథ్యంలో బేగ్ స్వరం మారింది. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకుంటే పరిస్థితికి అనుగుణంగా రాజీపడాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి  చేస్తున్నానన్నారు. 

బీజేపీతో ముస్లింలు  చేతులు కలపాలని మీ మాటలకు అర్థమా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అవసరమైతే చేతులు కలపాల్సి ఉంటుందన్నారు. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్టేనా అని మీడియా మళ్లీ అడిగినప్పుడు పరిస్థితిని బట్టి అలా జరగొచ్చన్నారు.

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, సిద్ధరామయ్య సహా సీఎల్‌పీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని  సరిగా నిర్వహించలేకపోయారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారడానికి వారే కారణమని కూడా రోషన్ బేగ్ మండిపడ్డారు.

బేగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర మండిపడ్డారు. రోషన్ బేగ్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం పార్టీ అభిప్రాయం కానీ, పార్టీ అంచనా కానీ కాదని స్పష్టం చేశారు.

షాకింగ్: అవసరమైతే బీజేపీతో ముస్లింలు చేతులు కలపాలన్న కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు! | actioncutok.com