ఇటు హీరో.. అటు విలన్!


ఇటు హీరో.. అటు విలన్!
Karthikeya Gummakonda

ఇటు హీరో.. అటు విలన్!

‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో హీరోగా పరిచయమై రెండో సినిమా ‘ఆర్ ఎక్స్ 100’తో వెలుగులోకి వచ్చాడు కార్తికేయ గుమ్మకొండ. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నాడు. త్వరలో అతను ద్విభాషా చిత్రం ‘హిప్పీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అది చిత్రీకరణ దశలో ఉండగానే వరుస ఆఫర్లు అతడిని వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే హీరోగా ‘గుణ 369’ సినిమా చేస్తోన్న అతను నాని హీరోగా విక్రం కుమార్ రూపొందిస్తోన్న ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా నటించేందుకు అంగీకరించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమాలో అతడు ఒక టిపికల్ విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం.

‘ఆర్ ఎక్స్ 100’తో అతడి కెరీర్‌కు గొప్ప ఊపునిచ్చిన దర్శకుడు అజయ్ భూపతి రూపొందించే రెండో సినిమాలోనూ అతడు భాగం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. నాగచైతన్య హీరోగా నటించే ఈ సినిమాలో కార్తికేయ చేసే కేరెక్టర్ ఏమిటనేది వెల్లడి కాకపోయినా అందులోనూ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది.

ఏదేమైనా ఓ వైపు హీరోగా, మరోవైపు విలన్‌గా నటించడానికి ముందుకొస్తున్న కార్తికేయ కెరీర్ భవిష్యత్తులో ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరం.

ఇటు హీరో.. అటు విలన్! | actioncutok.com

Trending now: