వరల్డ్ కప్‌కు కేదార్ జాదవ్ ఫిట్!


వరల్డ్ కప్‌కు కేదార్ జాదవ్ ఫిట్!
Kedar Jadhav

వరల్డ్ కప్‌కు కేదార్ జాదవ్ ఫిట్!

క్రికెట్ ప్రేమికులకు శుభవార్త! విరాట్ కోహ్లీ నేతృత్వంలో పాల్గొనే టీం ఇండియాలో ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ స్థానం పదిలమైంది. అతను ఫిట్‌గా ఉన్నాడనీ, ఈ నెల 22న ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళ్లే టీం ఇండియాతో కలిసి అతను ప్రయాణించనున్నాడనీ సమాచారం. విలువైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకొని, వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన జాదవ్.. ఐపీఎల్‌లో ఈ నెల మొదట్లో పంజాబ్ కింగ్స్ లెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు.

ఎడమ భుజానికి గాయమవడంతో అతని ఫిట్నెస్‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. దాంతో వెంటనే అతడికి విశ్రాంతి కల్పించారు. ఫలితంగా చెన్నై ఆడిన ప్లేఆఫ్స్‌ను జాదవ్ మిస్సయ్యాడు. వరల్డ్ కప్‌కు ఎంపికైన ఆటగాళ్లకు గాయాలు కాకుండా చూడాలని బీసీసీఐ చేసిన సూచనల మేరకే అతడిని చెన్నై జట్టు ప్లేఆఫ్స్ ఆడించలేదు.

ఫిజియో ప్యాట్రిక్ ఫరార్ట్‌ను ఆస్ట్రేలియా నుంచి త్వరగా వచ్చి, జాదవ్ పరిస్థితిని మానిటర్ చెయ్యమని బీసీసీఐ కోరింది. అందుకు అనుగుణంగా జాదవ్ ఫిట్నెస్ రిపోర్టును బీసీసీఐకి ప్యాట్రిక్ సమర్పించాడు. ఆ రిపోర్ట్ ప్రకారం ఇంగ్లండ్ వెళ్లేందుకు జాదవ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.

మే 30 నుంచి జూలై 14 వరకు జరగనున్న వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనున్నది

వరల్డ్ కప్‌కు కేదార్ జాదవ్ ఫిట్! | actioncutok.com

More for you: