లగడపాటి రిజల్ట్స్ రేపే!


లగడపాటి రిజల్ట్స్ రేపే!
Lagadapati Rajagopal

లగడపాటి రిజల్ట్స్ రేపే!

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తెలుగు  ప్రజలు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాజీ ఎంపీ లగటిపాటి రాజగోపాల్‌ అన్నారు.శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వంతోనే కాక  కేంద్ర ప్రభుత్వంతోనూ ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉన్నందున  ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠతో ఎదరుచూస్తున్నారన్నారు.

ఇటీవల తాను విదేశాలకు వెళ్లినపుడు అక్కడి తెలుగువారితో మాట్లాడానని, వారు కూడా రాష్ట్ర ఫలితాలపై మనకంటే ఎక్కువ ఆసక్తితో  ఎదురుచూస్తున్నారని లగడపాటి తెలిపారు. ఈ నెల 23న  ఫలితాలు అధికారికంగా తెలుస్తాయి. ఆదివారం  చివరి దశ ఎన్నికల తర్వాత పలు ఎగ్జిట్‌ పోల్స్‌, సర్వేలు ప్రజల ముందుకు రానున్నాయన్నారు. ప్రజానాడి తెలుసుకున్నాం.. ఆదివారం  సంఖ్య చెప్పబోతున్నానని లగడపాటి ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై ఆదివారం  సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో ప్రకటిస్తామన్నారు. తాను తెలిపే ఫలితాలు రాజకీయ కోణంలో చూడొద్దని, ఈ  ఫలితాలు తన ఇష్టం తో చేసినవిగా భావించాలని లగడపాటి కోరారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రజలనాడి తెలుసుకోవడం తనకు చాలా  ఆసక్తికర అంశమన్నారు.

లగడపాటి రిజల్ట్స్ రేపే! | actioncutok.com

More for you: