ఇక సర్వేల జోలికి పోను!


ఇక సర్వేల జోలికి పోను!

ఇక సర్వేల జోలికి పోను!

అమరావతి : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు విచారిస్తున్నానని విజయవాడ మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందుకు కారణాలు ఏమైనా వరుసగా రెండు సార్లు విఫలమయ్యానని,  భవిష్యత్తులో సర్వేల జోలికి పోకూడదని  నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.

2004 నుంచి సర్వేలు తనకొక వ్యాపకంగా మారాయని, ప్రజల నాడి ఎవరికి అనుకూలమైనా, వ్యతిరేకమైనా  పక్షపాతం లేకుండా చెప్పానని  వ్యాఖ్యానించారు. ఈ కోవలోనే ఏపీ, తెలంగాణలో కూడా మీడియా ద్వారా సర్వే వివరాలను ప్రజలకు వివరించానని అన్నారు.తన ఫలితాలు ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించమని కోరుతున్నానని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టనున్న జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు.

ఇక సర్వేల జోలికి పోను!

ఇక సర్వేల జోలికి పోను! | actioncutok.com

More for you: