తెలంగాణలో ‘మహర్షి’కి 5 షోలు!


మహేశ్ హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమాని తెలంగాణ వ్యాప్తంగా రిలీజవుతున్న అన్ని థియేటర్లలో రోజుకు 5 షోలు ఆడించడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.

తెలంగాణలో 'మహర్షి'కి 5 షోలు!

తెలంగాణలో ‘మహర్షి’కి 5 షోలు!

తెలంగాణలోని అన్ని థియేటర్లలో ‘మహర్షి’ని 5 షోలు వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలవుతున్న మే 9 నుంచి 14 రోజుల పాటు, అంటే మే 22 వరకు అన్ని థియేటర్లు రోజుకు 5 షోలు ఆడించవచ్చు.

వేసవి సెలవుల్లో ‘మహర్షి’ కోసం ప్రజలు అనేక అంచనాలతో ఎదురు చూస్తున్నారనీ, బ్లాక్ మార్కెటింగ్‌నీ, థియేటర్ల వద్ద జన సందోహాన్ని నిరోధించడానికీ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవకుండా ఉండటానికీ 5 షోలకు అనుమతినిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు అదనపు ఆటకు అనుమతినిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లలకూ ఇది వర్తిస్తుందని తెలిపారు.

కాకపోతే ఆ ఉత్తర్వులో ఒక పొరపాటు దొర్లడం గమనార్హం. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ మే 25న పంపిన అభ్యర్థన లేఖను పరిగణనలోకి తీసుకొని ఈ ఉత్తర్వులిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఏప్రిల్ 25న అనడానికి బదులు మే 25న అని పొరపాటుగా పేర్కొన్నారని అర్థమవుతోంది.

ప్రభుత్వం రెండు వారాల పాటు పర్మిషన్ ఇచ్చినప్పటికీ అన్ని రోజులు 5 ఆటలు వేయకపోవచ్చు. కారణం అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్నందున తొలి వారం తర్వాత యథాతథంగా 4 ఆటలే ప్రదర్శించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదేమైనా 5 ఆటల పర్మిషన్‌తో ‘మహర్షి’కి రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ తథ్యంగా కనిపిస్తున్నాయి.

తెలంగాణలో ‘మహర్షి’కి 5 షోలు! | actioncutok.com

Trending now: