‘మహర్షి’ ఓపెనింగ్స్ ఆ డిజాస్టర్స్ కంటే తక్కువే!


తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో ‘మహర్షి’ రూ. 24.6 కోట్ల షేర్‌తో ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచింది.

'మహర్షి' ఓపెనింగ్స్ ఆ డిజాస్టర్స్ కంటే తక్కువే!

‘మహర్షి’ ఓపెనింగ్స్ ఆ డిజాస్టర్స్ కంటే తక్కువే!

‘మహర్షి’ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.6 కోట్ల (అధికారిక లెక్కల ప్రకారం) షేర్ వసూలు చేసి మహర్షి కేరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అయితే అనూహ్యమైన అంచనాలు, నిర్మాత దిల్ రాజు చెప్పినట్లు ‘బాహుబలి’ తర్వాత అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమాకు ఈ ఓపెనింగ్స్ తక్కువేనని చెప్పాలి.

పైగా టికెట్ రేట్లు పెరిగాయి.. షోస్ పెరిగాయి. అయినప్పటికీ ఓపెనింగ్స్‌లో నాన్-బాహుబలి రికార్డుకు సుదూరంగా ఉడిపోయింది ‘మహర్షి’. ఓవరాల్‌గా తొలిరోజు వసూళ్లలో ‘మహర్షి’ది ఐదో స్థానం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఫ్లాపైన రాంచరణ్ సినిమా ‘వినయ విధేయ రామ’ కంటే కూడా ‘మహర్షి’ తొలిరోజు వసూళ్లు తక్కువ కావడం గమనార్హం. ‘వినయ విధేయ రామ’కు తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25.87 కోట్ల షేర్ వచ్చింది.

తొలిరోజు పవన్ కల్యాణ్ సినిమా ‘అజ్ఞాతవాసి’కి రూ. 26.94 కోట్లు, జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘అరవింద సమేత’కు రూ. 26.15 కోట్లు వసూలయ్యాయి. ఓవరాల్‌గా తొలిరోజు రికార్డు ప్రభాస్ సినిమా ‘బాహుబలి 2’ పేరిట ఉంది. ఆ సినిమా రూ. 42.74 కోట్ల షేర్ వసూలు చేసి, ఇతర ఏ సినిమాకీ అందనంత ఎత్తులో నిలిచింది.

‘మహర్షి’ ఓపెనింగ్స్ ఆ డిజాస్టర్స్ కంటే తక్కువే! | actioncutok.com

Trending now: