నైజాంలో ‘రంగ‌స్థ‌లం’ని ఆక్రమిస్తోన్న ‘మ‌హ‌ర్షి’


నైజాంలో 'రంగ‌స్థ‌లం'ని ఆక్రమిస్తోన్న 'మ‌హ‌ర్షి'

నైజాంలో ‘రంగ‌స్థ‌లం’ని ఆక్రమిస్తోన్న ‘మ‌హ‌ర్షి’

‘మ‌హ‌ర్షి’.. మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టించిన 25వ చిత్రం. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ నెల 9న విడుద‌లైన ఈ సినిమాకి.. మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. అయితే.. వ‌సూళ్ళ విష‌యంలో మాత్రం ఈ చిత్రం మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌నే చూపింది. ఓవ‌రాల్‌గా ఓవ‌ర్సీస్‌, సీడెడ్‌లో న‌ష్టాల బాట ప‌ట్టినా.. నైజాంలో మాత్రం రికార్డు క‌లెక్ష‌న్ల‌ను న‌మోదు చేసుకుంది.

అంతేకాదు.. నైజాంలో ‘నాన్‌-బాహుబ‌లి’ రికార్డుకు అడుగు దూరంలో ఉంది ‘మ‌హ‌ర్షి’. నైజాంలో 18 రోజుల‌కిగానూ రూ.27.67 కోట్ల వ‌ర‌కు షేర్ రాబ‌ట్టిన ‘మ‌హ‌ర్షి’.. 19వ రోజు అంటే సోమ‌వారం వ‌చ్చే క‌లెక్ష‌న్ల‌తో ఫుల్ ర‌న్‌లో ‘రంగ‌స్థ‌లం’ రాబ‌ట్టిన మొత్తం షేర్ (రూ.27.70 కోట్లు)ని అధిగ‌మించ‌బోతోంద‌ని ట్రేడ్ టాక్‌. ఏదేమైనా.. మిక్స్‌డ్ టాక్‌తో ‘మ‌హ‌ర్షి’ నైజాంలో టాప్ 3 మూవీగా.. ‘నాన్ – బాహుబ‌లి’ రికార్డుని సొంతం చేసుకుంటుండ‌డం విశేషం.  

కాగా.. నైజాంలో రూ.68 కోట్ల షేర్‌తో ‘బాహుబ‌లి 2 – ది కంక్లూజ‌న్‌’ మొద‌టి స్థానంలో ఉంటే.. రూ.42.70 కోట్ల షేర్‌తో ‘బాహుబలి – ది బిగినింగ్‌’ ఉంది. 

నైజాంలో ‘రంగ‌స్థ‌లం’ని ఆక్రమిస్తోన్న ‘మ‌హ‌ర్షి’ | actioncutok.com

More for you: