చెన్నైలో ‘మహర్షి’ ఫ్యాన్స్ షో!


చెన్నైలో 'మహర్షి' ఫ్యాన్స్ షో!

చెన్నైలో ‘మహర్షి’ ఫ్యాన్స్ షో!

‘మహర్షి’ మేనియా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్నీ ఊపేస్తోంది. హైదరాబాద్‌లో ‘మహర్షి’ మొదటిరోజు ఆన్‌లైన్ విక్రయాలు మహా జోరుగా సాగుతుండగా, చెన్నైలో మహేశ్ అభిమానుల కోసం కాశి థియేటర్‌లో బెనిఫిట్ షో ఏర్పాటు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

సాధారణంగా కాశి థియేటర్‌లో రజనీకాంత్, విజయ్, అజిత్ వంటి తమిళ సూపర్ స్టార్ల సినిమాలకే తెల్లవారు జాము 5 గంటలకు ఫ్యాన్స్ షో వేస్తుంటారు. అలాంటిది ఆ థియేటర్‌లో మే 9 తెల్లవారు జాము 5 గంటలకు ‘మహర్షి’ ఫ్యాన్స్ షో వేస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఆ షో పాస్‌లన్నీ ఆమ్ముడయ్యాయి.

ఆ షో కోసం ప్రత్యేకంగా మహర్షి టీ షర్టుల్ని చెన్నై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఏర్పాటు చేసింది. కాగా కాశి థియేటర్‌తో పాటు వెట్రి, రక్కి, జీకే సినిమాస్, సత్యం దేవి థియేటర్లలో మహేశ్ అభిమానులు ‘మహర్షి’ విడుదలను సెలబ్రేట్ చేస్తున్నారు.

చెన్నైలో 'మహర్షి' ఫ్యాన్స్ షో!
Maharshi T Shirts

చెన్నైలో ‘మహర్షి’ ఫ్యాన్స్ షో! | actioncutok.com

Trending now: