మహర్షి: తొలిరోజు వసూళ్ల లెక్కలు తేలాయ్!


‘మహర్షి’ సినిమా తొలిరోజు రెండు రాష్ట్రాల్లో రూ. 24.6 కోట్ల షేర్ వసూలు చేసి మహేశ్ సినిమాల్లో రికార్డ్ సృష్టించింది.

మహర్షి: తొలిరోజు వసూళ్ల లెక్కలు తేలాయ్!

మహర్షి: తొలిరోజు వసూళ్ల లెక్కలు తేలాయ్!

మహేశ్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన ‘మహర్షి’ సినిమా తొలిరోజు అంచనాలకు తగ్గట్లే వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ. 24.6 కోట్ల షేర్ వసూలు చేసింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా, అల్లరి నరేశ్ ఒక కీలక పాత్రలో నటించిన ఈ సినిమా తెలంగాణ (నైజాం)లో రూ. 6.38 కోట్లు, రాయలసీమ (సీడెడ్)లో రూ. 2.89 కోట్లు వసూలు చేసింది.

ఇక ఆంధ్రా ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఏరియాలు కలిసి ఉండే ఆంధ్రాలో రూ. 15.34 కోట్లు వసూలు చెయ్యడం విశేషం. వీటిలో ఉత్తరాంధ్ర రూ. 2.88 కోట్లు, ఈస్ట్ రూ. 3.2 కోట్లు, వెస్ట్ రూ. 2.47 కోట్లు, కృష్ణా రూ. 1.39 కోట్లు, గుంటూరు రూ. 4.4 కోట్లు, నెల్లూరు రూ. 1 కోటి వసూళ్లు రాబట్టినట్లు ‘మహర్షి’ అధికారిక పీఆర్వో బి.ఎ. రాజు తెలిపారు.

రాయలసీమలో తక్కువ వసూలు కావడం ఆలోచించాల్సిన విషయం. నాలుగు జిల్లాల పరిధిలోని రాయలసీమ కంటే గుంటూరు, ఈస్ట్ ప్రాంతాల్లో ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం. ఏదేమైనా ఒక ప్రాంతీయ భాషా చిత్రం తొలిరోజు 24.6 కోట్ల షేర్ సాధించడం అసాధారణ విషయం.

మహర్షి: తొలిరోజు వసూళ్ల లెక్కలు తేలాయ్! | actioncutok.com

Trending now:

2 thoughts on “మహర్షి: తొలిరోజు వసూళ్ల లెక్కలు తేలాయ్!

Comments are closed.