మహర్షి: ఫస్ట్ డే నాన్-బాహుబలి రికార్డే లక్ష్యం!


‘మహర్షి’ని నిర్మాత దిల్ రాజు తొలి రోజు అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తుండటంతో నాన్-బాహుబలి రికార్డు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు నమ్ముతున్నారు.

మహర్షి: ఫస్ట్ డే నాన్-బాహుబలి రికార్డే లక్ష్యం!

మహర్షి: ఫస్ట్ డే నాన్-బాహుబలి రికార్డే లక్ష్యం!

మహేశ్ టైటిల్ రోల్ చేసిన ‘మహర్షి’ విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ సినిమాపై క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోతూ వస్తోంది. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ మంజూరు చేసిన ఈ సినిమా ఆన్‌లైన్ టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడు పోతున్నాయి.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చెయ్యగా, పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ సినిమా మహేశ్ కెరీర్‌లో మైలురాయిలా నిలిచే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద నాన్-బాహుబలి రికార్డులను ఈ సినిమా సొంతం చేసుకోవడం గ్యారంటీ అని, కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ రికార్డుల్ని బ్రేక్ చేసే సత్తా ఈ సినిమాకి ఉందని వాళ్లు విశ్లేషిస్తున్నారు.

మే 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. సెన్సార్ రిపోర్ట్ గొప్పగా ఉండటంతో సినిమాకి ఏ రకంగా చూసినా పాజిటివ్ వాతావరణమే కనిపిస్తోందనీ, తొలిరోజు అది కలెక్షన్ల తుఫానును సృష్టిస్తుందనీ భావిస్తున్నారు. ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ రికార్డులు (నాన్-బాహుబలి) బ్రేక్ అవుతాయని విశ్లేషకులు నమ్ముతున్నారు.

Related articles: