2020లో డబుల్ ధమాకా?

2020లో డబుల్ ధమాకా?
2000, 2002, 2003, 2004, 2006, 2014.. ఈ సంవత్సరాలన్నీ మహేశ్ బాబు అభిమానులకు వెరీ స్పెషల్ ఇయర్స్. ఎందుకంటే.. ఈ ఆరు సంవత్సరాల్లో మహేశ్ నుంచి రెండేసి సినిమాలు వచ్చాయి. 2000లో యువరాజు, వంశీ.. 2002లో టక్కరి దొంగ, బాబీ.. 2003లో ఒక్కడు, నిజం.. 2004లో నాని, అర్జున్.. 2006లో పోకిరి, సైనికుడు.. 2014లో 1 నేనొక్కడినే, ఆగడు.. ఇలా మొత్తంగా ఆరు సార్లు డబుల్ ధమాకా ఇచ్చాడు మహేశ్.
కట్ చేస్తే.. ఇదే ఫీట్‌ని 2020లోనూ రిపీట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాడట మహేశ్. ఆ వివరాల్లోకి వెళితే.. జూన్ నుంచి మహేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఫిల్మ్ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని 2020 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
ఆ తరువాత పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని ఫిల్మ్‌నగర్ టాక్. మార్చిలో మొదలయ్యే ఈ చిత్రం.. వచ్చే ఏడాది చివరలో రిలీజ్ కానుందని సమాచారం. అంటే.. 2020లో మహేశ్ నుంచి రెండు చిత్రాలు రావడం దాదాపుగా ఖాయమేనన్నమాట. మరి.. ఈ రెండు చిత్రాలతో 2020లో మహేశ్ విజయఢంకా మ్రోగిస్తాడేమో చూద్దాం.
2020లో డబుల్ ధమాకా? | actioncutok.com