మహేశ్‌కి తెలుగు రాదు!


మహేశ్‌కి తెలుగు చదవడం, రాయడం రాకపోయినా డైరెక్టర్ చెప్పిన డైలాగ్స్ గుర్తుపెట్టుకొని చెప్తాడు.

మహేశ్‌కి తెలుగు రాదు!

మహేశ్‌కి తెలుగు రాదు!

ఇంగ్లీష్ మీడియంలలో చదువుకోవడం వల్ల తెలుగు చిత్రసీమలోని చాలామంది హీరోలకు తెలుగు మాతృభాష అయినా తెలుగులో చదవడం, రాయడం రాదు. వెంకటేశ్ ఇప్పటికీ తెలుగు చదవలేరు. నాగార్జునకు కూడా మొదట్లో తెలుగు చదవడం వచ్చేది కాదు కానీ, తర్వాత నేర్చుకున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ కూడా తెలుగు చదవలేడు, రాయలేడు.

మహేశ్ చిన్నతనం చెన్నైలో గడవడం వల్ల, అక్కడే ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదవుకున్నాడు. దాంతో తెలుగు చదవడం నేర్చుకోలేదు. అది ఆ తర్వాత కూడా కొనసాగింది. ఇప్పటికీ అదే పరిస్థితి. మరి సినిమాల్లో డైలాగ్స్ ఎలా చెప్తాడు? ఇంగ్లిష్‌లో రాసుకొని చదువుకుంటాడా? కాదు.

“నాకు తెలుగు చదవడం రాదు. డైరెక్టర్ సీన్ నెరేట్ చేస్తూ డైలాగ్ చెప్పినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకొని చెప్తాను. పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పేప్పుడు ఐ ఫీల్ వెరీ గుడ్” అని చెప్పాడు మహేశ్. అదీ సంగతి!

మహేశ్‌కి తెలుగు రాదు! | actioncutok.com

Trending now: