యూరప్‌లో జాలీగా ఎంజాయ్ చేస్తూ…


యూరప్‌లో జాలీగా ఎంజాయ్ చేస్తూ...

యూరప్‌లో జాలీగా ఎంజాయ్ చేస్తూ…

‘మహర్షి’గా తన నటనతో ప్రేక్షకుల్నీ, అభిమానుల్నీ అలరించడమే కాకుండా రైతుల కోసం ఏమైనా చెయ్యాలనే సందేశాన్నిచ్చిన మహేశ్, ప్రస్తుతం తన విజయాన్ని హాలిడేస్ రూపంలో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య నమ్రత, పిల్లలు గౌతం, సితారతో కలిసి యూరప్‌ను చుట్టేస్తున్నాడు. ఇంగ్లండ్, పోర్చుగల్‌లో 20 రోజులు గడిపేందుకు వెళ్లిన తమ కుటుంబానికి చెందిన ఫొటోల్ని ఇటు మహేశ్, అటు నమ్రత తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షేర్ చేస్తున్నారు.

హాలిడేస్ పూర్తి చేసుకొని వచ్చాక మహేశ్ తన తదుపరి సినిమా షూటింగ్‌తో బిజీ కానున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే ఆ సినిమాని అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు. మహేశ్ జోడీగా తాజా సంచలన తార రశ్మికా మండన్న నటించనున్నది. ఆ సినిమాకు ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్ వినిపిస్తున్నది కానీ అధికారికంగా ధ్రువపడాల్సి ఉంది. విజయశాంతి, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించనున్నారు.

ఈ సినిమా తర్వాత పరశురాం డైరెక్షన్‌లో చెయ్యడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్.

యూరప్‌లో జాలీగా ఎంజాయ్ చేస్తూ… | actioncutok.com

More for you: