మహేశ్‌కు నెత్తుర్ని చూస్తే భయం!


మహేశ్‌కు నెత్తుర్ని చూస్తే భయం!

మహేశ్‌కు నెత్తుర్ని చూస్తే భయం!

ఈ వేస‌వికి ‘మ‌హ‌ర్షి’తో ప‌ల‌క‌రించిన మ‌హేశ్ బాబు.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జూన్ ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాని.. 2020 సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మ‌హేశ్ ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని ఓ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలిసింది.

అదేమిటంటే.. హిమోఫోబిక్‌గా ఈ పాత్ర ఉంటుంద‌ట‌. అంటే.. ర‌క్తాన్ని చూసి భ‌య‌ప‌డే డిజార్డ‌ర్ అన్న‌మాట‌. ఈ పాత్ర చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు చాలా స‌ర‌దాగా ఉంటాయ‌ని స‌మాచారం. అంతేకాదు.. ఈ సినిమాలో రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారిగా క‌నిపించ‌నున్నాడట‌ మ‌హేశ్‌.

అలాగే.. అవుట్ అండ్ అవుట్ రాయ‌ల‌సీమ యాస‌లో అత‌ని సంభాష‌ణ‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. మ‌రి.. స‌రికొత్త పాత్ర‌లో మ‌హేశ్ న‌ట‌న ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వ‌ర‌కు ఆగాల్సిందే.

మహేశ్‌కు నెత్తుర్ని చూస్తే భయం! | actioncutok.com