బీజేపీ కలలు కల్లలే!


బీజేపీ కలలు కల్లలే!
Mallikarjun Kharge

బీజేపీ కలలు కల్లలే!

కల్ బుర్గి (కర్ణాటక) : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే కొట్టిపారేశారు. వారెప్పుడూ కలలు కంటూ ఉంటారని ఎద్దేవా చేశారు.

బీజేపీ కర్ణాటకలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వాళ్లకు ఓ అవకాశం వచ్చినా బలం నిరూపించుకోలేక చేతులెత్తేశారంటూ  బీజేపీని ఆయన ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మళ్లీ ఎన్నికలను ప్రజలు కోరుకోవడం లేదని, అంతేగాక  కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఐక్యంగా ఉందని ఖర్గే తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాల్లో  బీజేపీ 104 స్థానాలు దక్కించుకుని  అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి  అవసరమైన సీట్లు సాధించలేకపోయింది. మెజారిటీకి 113 సీట్లు అవసరం. 37 మంది ఎమ్మెల్యేలున్న జేడీఎస్, 80 మంది సభ్యులున్న కాంగ్రెస్ కలిసి ఇండిపెండెంట్ల మద్దతుతో జేడీఎస్ నేత  కుమారస్వామి ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

బీజేపీ కలలు కల్లలే! | actioncutok.com