‘మన్మథుడు 2’ ముందే వస్తున్నాడా?


'మన్మథుడు 2' ముందే వస్తున్నాడా?

‘మన్మథుడు 2’ ముందే వస్తున్నాడా?

నాగార్జున సీక్వెల్స్ బాట ప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు ‘మ‌న్మ‌థుడు’ (2002) సీక్వెల్ ‘మ‌న్మ‌థుడు 2’తో బిజీగా ఉంటూనే.. మ‌రో వైపు ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ సీక్వెల్ ‘బంగార్రాజు’ ప్లాన్ చేస్తున్నాడు నాగ్‌.

ఇదిలా ఉంటే.. గ‌త‌కొంత‌కాలంగా పోర్చుగ‌ల్‌లో నిర‌వ‌ధికంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ‘మ‌న్మ‌థుడు 2’..  తాజాగా పోర్చుగ‌ల్ షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. స్వ‌ల్ప విరామం తీసుకుని.. ఆపై హైద‌రాబాద్‌లో నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్‌. ఈ షెడ్యూల్‌తో సినిమా తుది ద‌శ‌కు చేరుకుంటుంద‌ని స‌మాచారం.

అంతేకాదు.. ఈ చిత్రాన్ని మొద‌ట అనుకున్న‌ట్లుగా ఆగ‌స్టులోనో లేదంటే విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంలోనో కాకుండా జూలై నెల‌లోనే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. అంటే.. మొద‌ట అనుకున్న షెడ్యూల్ కంటే ముందే  రెండో ‘మ‌న్మ‌థుడు’ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడ‌న్న‌మాట‌. 

మ‌రి.. ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ త‌రువాత స‌రైన విజ‌యం లేని నాగ్‌కి.. ఈ సీక్వెల్ అయినా వ‌ర్క‌వుట్ అవుతుందేమో చూడాలి.

‘మన్మథుడు 2’ ముందే వస్తున్నాడా? | actioncutok.com

Trending now: