Meera Jasmine’s Shocking Makeover


Meera Jasmine's Shocking Makeover

మీరాజాస్మిన్ షాకింగ్ మేకోవ‌ర్‌!

‘అమ్మాయి బాగుంది’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది మీరాజాస్మిన్. తొలి సినిమాతోనే అమ్మాయి బాగుంది అనిపించుకుంది. టాలీవుడ్ వ‌ర్గాల‌ని త‌న అభిన‌యం, అందంతో ఆక‌ట్టుకున్న మీరాజాస్మిన్ ఆ త‌రువాత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ‘గుడుంబాశంక‌ర్‌’, ర‌వితేజ‌తో ‘భ‌ద్ర‌’, గోపీచంద్‌తో ‘రారాజు’ వంటి చిత్రాల్లో న‌టించింది.

రాజ‌శేఖ‌ర్‌కు చెల్లెలుగా న‌టించిన ‘గోరింటాకు’ త‌రువాత తెలుగులో చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో న‌టించ‌లేదు. తెలుగులో ఆమె న‌టించిన చివ‌రి చిత్రం ‘మోక్ష‌’. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా త‌రువాత అవ‌కాశాలు త‌గ్గ‌డంతో త‌న మాతృభాష మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌కు వెళ్లిపోయింది.

సిరియ‌న్ క్రిస్టియ‌న్ ఫ్యామిలీకి చెందిన మీరాజాస్మిన్ మాండ‌లీన్ ఎక్స్‌ప‌ర్ట్ రాజేష్‌ని వివాహం చేసుకోవాల‌నుకుంది. కానీ కుద‌ర‌లేదు. దాంతో జాన్ టిటుస్ అనే వ్య‌క్తిని 2014లో పెళ్లిచేసుకుని సినిమాల‌కు దూర‌మైంది. బాగా బ‌రువు పెరిగిన మీరాజాస్మిన్ ఇక సినిమాల‌కు శాశ్వ‌తంగా దూర‌మైన‌ట్టే అని అంతా భావించారు కానీ తాజాగా అంద‌రికి షాకిస్తూ స‌రికొత్త మేకోవ‌ర్‌తో స్లిమ్‌గా మీరాజాస్మిన్ త‌యారు కావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇటీవ‌ల జ‌రిగిన ఓ వివాహ వేడుక‌లో మీరాజాస్మిన్ గులాబి వ‌ర్ణం డ్రెస్‌లో మెరిసిపోతూ క‌నిపించి అంద‌రికి షాకిచ్చింది. ఇప్పుడు ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Meera Jasmine’s Shocking Makeover | actioncutok.com

Trending now: