ఆయన పెళ్లికూతురు లాంటి వ్యక్తి!


ఆయన పెళ్లికూతురు లాంటి వ్యక్తి!
Navjot Singh Siddhu

ఆయన పెళ్లికూతురు లాంటి వ్యక్తి!

ఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధు శనివారం మరో సారి ప్రధాని నరేంద్ర మోదీ మీద విరుచుకు పడ్డారు. అబద్ధాలకు అధికారి, బడా వ్యాపారవేత్తలు అనిల్ అంబానీ, గౌతమ్‌ అదానీలకు మేనేజర్‌లా వ్యవహరిస్తున్నారంటూ  ధ్వజమెత్తారు.

‘భారత విభజనాధికారి’ శీర్షికన ప్రధాని నరేంద్ర మోదీ ముఖచిత్రంతో అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్‌ తన కొత్త సంచికను విడుదల చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని  సిద్ధు ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మోదీని ఒక పెళ్లికూతురితో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

“మోదీ ఒక పెళ్లి కూతురు లాంటి వ్యక్తి. ఆ మహిళ కొన్ని రోటీలు మాత్రమే చేస్తుంది. ఎక్కువ గాజులు వేసుకొని పెద్ద శబ్దం చేస్తూ చుట్టుపక్కల వారికి పనిచేస్తున్నాననే భావనను కలిగిస్తుంది” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఇవి అభ్యంతరకర వ్యాఖ్యలంటూ ఈసీ సిద్ధుకు మరోసారి నోటీసులు జారీ చేసింది.

భోపాల్‌లో జరిగిన  ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన విమర్శలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కిందికి వస్తాయని ఈసీ శుక్రవారం సిద్ధుకు నోటీసులు జారీ చేసింది.

ఆయన పెళ్లికూతురు లాంటి వ్యక్తి! | actioncutok.com

Trending now: