చివరి నిమిషంలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయా!?


చివరి నిమిషంలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయా!?
Arvind Kejriwal

చివరి నిమిషంలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయా!?

దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 సీట్లు తమకే వస్తాయని నిన్నటి దాకా చెప్పిన ఆం ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు.. మే 12 పోలింగ్ తర్వాత పరిస్థితి బోధపడినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో 12 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన.. పోలింగ్ మొదలయ్యే చివరి క్షణంలో మైనారిటీ కమ్యూనిటీ ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లాయని చెప్పారు.

“ఏం జరుగుతుందో చూడాలి. పోలింగ్‌కు 48 గంటల ముందు వరకు, మొత్తం 7 సీట్లూ AAPకే వస్తాయనే పరిస్థితి ఉంది. కానీ చివరి క్షణంలో ముస్లిం ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడ్డాయి. దీని వల్ల ఏం జరుగుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నాం” అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికకు చెప్పారు కేజ్రీవాల్.

ఢిల్లీలో ముస్లిం ఓట్లు 12 నుంచి 13 శాతం వరకు ఉన్నందున ఇది AAP అవకాశాల్ని గండి గొడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలకు మే 12న జరిగిన పోలింగ్‌లో 60 శాతం వోటింగ్ నమోదయింది. ఈ సీట్లలో బీజేపీ, కాంగ్రెస్, AAP మధ్య ముక్కోణ పోటీ జరిగింది. 2014 ఎన్నికల్లో మొత్తం 7 సీట్లనూ బీజేపీ గెలుచుకుంది.

చివరి నిమిషంలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయా!? | actioncutok.com

More for you: