‘ద‌డ‌’ పుట్టించిన జోడీ.. మ‌రోసారి!


'ద‌డ‌' పుట్టించిన జోడీ.. మ‌రోసారి!
Naga Chaitanya and Kajal Aggarwal

‘ద‌డ‌’ పుట్టించిన జోడీ.. మ‌రోసారి!

‘మ‌జిలీ’తో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌.. మ‌రింత ఉత్సాహంగా కొత్త సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నాడు. ప్ర‌స్తుతం.. త‌న మేన‌మామ వెంక‌టేశ్‌తో  క‌ల‌సి ‘వెంకీ మామ‌’లో న‌టిస్తున్న చైతూ.. ఆ త‌రువాత త‌న తొలి చిత్ర నిర్మాత దిల్‌ రాజు కాంబినేష‌న్‌లో ఓ సినిమా చేయ‌నున్నాడు.

అలాగే.. ‘సోగ్గాడే చిన్ని నాయ‌నా’ సీక్వెల్‌తో పాటు మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. దిల్‌ రాజు నిర్మాణంలో తెర‌కెక్క‌నున్న సినిమాని నూత‌న ద‌ర్శ‌కుడు శ‌శి రూపొందించ‌నుండ‌గా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. అంతేకాదు.. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో చైతూకి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించ‌బోతోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే చైతూ, కాజ‌ల్ ‘ద‌డ‌’ (2011)లో న‌టించారు. మ‌ళ్ళీ ఎనిమిదేళ్ళ త‌రువాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా ఇదే అవుతుంది. మ‌రి..’ద‌డ‌’తో ఫ్లాప్ జోడీ అనిపించుకున్న చైతూ, కాజ‌ల్‌.. కొత్త చిత్రంతోనైనా హిట్ కాంబినేష‌న్ అనిపించుకుంటుందేమో చూడాలి.

‘ద‌డ‌’ పుట్టించిన జోడీ.. మ‌రోసారి! |actioncutok.com

More for you: